ట్రెండింగ్
Epaper    English    தமிழ்

PS 1 నుండి సెకండ్ లిరికల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 17, 2022, 06:22 PM

మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్" మూవీ నుండి కొంచెంసేపటి క్రితమే సెకండ్ లిరికల్ అప్డేట్ వచ్చింది. చోళ చోళ అనే ఈ పాటను ఆగస్టు 19వ తేదీన సాయంత్రం 6గంటలకు విడుదల చెయ్యబోతున్నారు. AR రెహమాన్ స్వరపరిచిన ఈ పాటను సీనియర్ గాయకుడు మనోతో కలిసి యువగాయకుడు అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అనంతశ్రీరాం సాహిత్యం అందించారు. పోస్టర్ ను బట్టి ఈ పాట చోళుల విజయగీతంలా ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ్ల, ప్రభు కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ , మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com