మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళంలో ఘనవిజయం సాధించిన లూసిఫర్‌కి రీమేక్‌గా రూపొందుతున్న 'గాడ్‌ఫాదర్' సినిమాలో నటిస్తున్నారు. తాజాగా చిరంజీవి ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు.ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు.ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, బిజు మీనన్ మరియు మురళీ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించారు. ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందించారు.