క్లారిటీ ఇచ్చిన దిశా పటానీ పోస్ట్ దిశా పటానీ, టైగర్ ప్రాఫ్ విడిపోయారంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకోమని పటానీ పట్టు పట్టింది. దానికి టైగర్ నో చెప్పడంతో.. బ్రేకప్ కు దారి తీసింది. విడిపో యిన తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగాలని నిర్ణ యించుకున్నారని లీకుల ద్వారా తెలిసిన విషయం. అయితే తాజాగా దిశా పటానీ తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఉంది. "అంతా బాగానే ఉంటుంది అని ఎవరూ చెప్పకపోయినా సరే ఆత్మవిశ్వా సాన్ని కోల్పోకండి" అని పటానీ పోస్ట్ పెట్టింది. ఇది టైగర్ తో బ్రేకప్ బా ధే అని నెటిజన్లు అంటున్నారు.