ఇటీవలే గాడ్సే గా ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో సత్యదేవ్ త్వరలోనే మరొక కొత్త సినిమా "కృష్ణమ్మ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. VV గోపాలకృష్ణ డైరెక్షన్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్చన హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ "ఏమవుతుందో మనలో" ప్రోమో రిలీజ్ చేసారు. హీరోయిన్ ను చూస్తూ, హీరో పాడే ఈ పాటను సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. అనంతశ్రీరామ్ లిరిక్స్ అందించారు. పూర్తి పాటను రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చెయ్యనున్నారు.
ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.