సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభముహుర్తం రానే వచ్చేసింది. మేకర్స్ SSMB 28 నుండి బ్లాస్టింగ్ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం ప్రకటిస్తామని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ SSMB 28 హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ, సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ కాగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.