తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. బందిపోటు, అమీతుమీ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసి మెప్పించారు. బ్రాండ్ బాబులో హీరోయిన్‌గా ఆకట్టుకున్నారు.ఈ మధ్య కాలంలో ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తన హాట్ ఫొటోస్‌తో కుర్రకారుకు ఊపిరాడనీయకుండా చేస్తున్నారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు నెట్టింట లైకుల వర్షం కురుస్తుంటుంది.మొన్నటి వరకు చిట్టి పొట్టి డ్రెసుల్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈషా రెబ్బా.. లాంగ్ డ్రెస్సులో అందాలను ప్రదర్శిస్తూ హాట్ టాపిక్‌గా మారారు. తాజా ఫోటోలలో ఆమె వావ్ అనిపిస్తున్నారు.