మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా పేర్కొనబడుతున్న "PS 1" నుండి ఇటీవలే తొలి లిరికల్ సాంగ్ "పొంగే నది" విడుదలై శ్రోతలను రంజింపజేసింది. లేటెస్ట్ గా మేకర్స్ సెకండ్ లిరికల్ సాంగ్ ను రేపు సాయంత్రo ఆరింటికి విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించారు.
చోళుల విజయ గీతికలా ఉండే ఈ పాటను AR రెహ్మాన్ స్వరపరచగా, మనో, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యమందించారు.
ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ్ల, ప్రభు కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ , మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించారు.