కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం "కోబ్రా". క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 11న విడుదల కావాల్సిన ఈ చిత్రం 31వ తేదికి వాయిదా పడింది.
ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ మూవీ పై స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, ఈ రోజు రాత్రి ఏడింటికి సోషల్ మీడియా రంగం ట్విట్టర్ లో కోబ్రా నుండి స్పెషల్ అప్డేట్ ఇస్తామని కోబ్రా స్పేసేస్ - చియాన్ విక్రమ్ స్పెషల్ పేరిట ఒక ప్రకటన చేసారు. మరి, ఈ అప్డేట్ లో మూవీ నుండి ఎలాంటి బ్లాస్టింగ్ వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.