హన్సిక.. ఈమె అందానికి ముగ్ధులవని వారుండరు. అంతటి అందానికి కోలీవుడ్లో విగ్రహం పెట్టి గుడి కూడా కట్టేసారు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించడమే కాక కళావతి, చంద్రకళ వంటి హారర్ సినిమాలతో భయపెట్టింది కుడా.
అల్లు అర్జున్ నటించిన "దేశముదురు" తో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ, తదుపరి కంత్రి, మస్కా, బిల్లా, కందిరీగ, ఓహ్ మై ఫ్రెండ్ వంటి తెలుగు సినిమాలలో నటించి, ఆపై కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వుమెన్ సెంట్రిక్ సినిమాలకు ప్రస్తుతం కేరాఫ్ అడ్రెస్ గా ఉంది హన్సిక.
లేటెస్ట్ గా హన్సిక ఇటీవలే తన యాభైవ సినిమా"మహా"తో ప్రేక్షకులను పలకరించింది. దీంతో హన్సిక గ్రీస్ కు వెకేషన్ కెళ్ళింది. అక్కడ అందమైన ప్రదేశాలలో తిరుగుతూ, ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు కన్నులపండుగ కల్పించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.