డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం "లైగర్". ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు.
లేటెస్ట్ గా లైగర్ మేకర్స్ ఫ్యాన్స్ కు స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. లైగర్ హ్యాష్ ట్యాగ్ ఎమోజిస్ ఇప్పుడు లైవ్ అందుబాటులోకొచ్చాయని తెలిపారు. లైగర్, వాట్ లగా దేంగే , లైగర్ హంట్ బిగిన్స్ అనే హ్యాష్ ట్యాగ్ లకు ఈ లైవ్ ఎమోజి అందుబాటులోకొచ్చింది.