మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం | 'ధమాకా'. ఈ సినిమా నుంచి 'జింతాక్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. 'నిన్ను సూడబుద్దెంతి రాజిగో మాటడబుధైతాంది రాజిగో.. ' అంటూ ఫోక్ శైలిలో హుషారుగా ఈ పాట సాగింది. తెలంగాణ సాహిత్యం తో సాగిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ రాయగా భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఈ ఏడాదిలోనే ధమాకా ప్రేక్షకుల ముందుకు రానుంది.