సత్యదేవ్ హీరోగా నటిస్తున్న "కృష్ణమ్మ" మూవీ నుండి మొదటి లిరికల్ సాంగ్ "ఏమవుతుందో మనలో ... మన మనసులలో" కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. కాలభైరవ స్వరపరిచిన ఈ గీతాన్ని టాప్ సింగర్ సిద్ధ్ శ్రీరామ్ ఆలపించగా, అనంతశ్రీరామ్ సాహిత్యమందించారు. ఇద్దరు హీరోలు హీరోయిన్లకు తమ ప్రేమను తెలిపే క్రమంలో వచ్చే ఈ పాట ప్రేమికులకు ప్రత్యేక గీతంలా ఆకర్షిస్తుంది.
VV గోపాలకృష్ణ డైరెక్షన్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్చన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో కృష్ణ బురుగుల, అతిరా రాజ్, లక్ష్మణ్ మీసాల తదితరులు నటించారు.