పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ "లైగర్" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడిగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఆగస్ట్ 20న గుంటూరులో సాయంత్రం 5 గంటల నుంచి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. గుంటూరులోని మోతడకలోని చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎవరు వస్తున్నారు అనే విషయంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa