ఇండియాస్ లెజెండరీ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న చిత్రం "పొన్నియిన్ సెల్వన్". ఈ చిత్రం నుండి సెకండ్ లిరికల్ సాంగ్ 'చోళ చోళ' నిన్న సాయంత్రం విడుదలైంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది.
ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ మణిరత్నం ఇలా అన్నారు.... మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు... ఎందుకో చెప్పను... తరవాత మీరే తెలుసుకుంటారు... అని అన్నారు. దీంతో ఈ సినిమాలో చిరు ఏదైనా ప్రత్యేక పాత్రలో నటించారా? లేక స్పెషల్ అప్పియరెన్స్ చేసారా? లేక వాయిస్ ఓవర్ ఇచ్చారా? అని ప్రేక్షకులు కన్ఫ్యూషన్ లో ఉన్నారు.
ఏమైనా మణిరత్నం గారు చిరంజీవికి ఎందుకు థాంక్స్ చెప్పారో తెలియాలంటే, ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.