యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా "నేను మీకు బాగా కావాల్సినవాడిని" ప్రమోషన్స్ నిమిత్తం చాలా బిజీగా గడుపుతున్నారు. నిన్న కడప లో ఫుల్ జోష్ లో జరిగిన ప్రమోషన్స్ తదుపరి రేపు హైదరాబాద్ లో ఈ మూవీ ప్రమోషన్స్ నిమిత్తం ఫ్యాన్స్ తో ప్రత్యేక మీటింగ్ ను ఏర్పాటు చేశారు. సారథి స్టూడియోస్ లో రేపు ఉదయం ఎనిమిదింటి నుండి ఈ ఫ్యాన్స్ మీటింగ్ జరగనుంది. ఈ ఈవెంట్ కు కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంజనా ఆనంద్, నిర్మాత కోడి దివ్య దీప్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా, కార్తిక్ శంకర్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు.
ఇటీవల విడుదలైన నచ్చావ్ అబ్బాయి అనే సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన విడుదల కాబోతుంది.