ఈ నెల 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్ లోని ప్రసాద్ సినిమాస్ లో రేపు, ఎల్లుండి "ఘరానా మొగుడు" స్పెషల్ షోస్ జరగనున్నాయి.
1992 లో విడుదలైన ఘరానా మొగుడు చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు డైరెక్ట్ చేసారు. నగ్మా, వాణి విశ్వనాధ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాతో చిరు "బిగ్గర్ దాన్ బచ్చన్" గా పేరు తెచ్చుకున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా చిరు కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ గా నిలుస్తుంది.