ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ ఆంథోనీ "హత్య" నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 20, 2022, 10:57 AM

కోలీవుడ్ హీరో విజయ్ ఆంథోనీ నటిస్తున్న కొత్త చిత్రం "హత్య". బాలాజీ కుమార్ డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'నీటి బుడగే' రిలీజ్ అయ్యింది.
సిద్ధ్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. ఈ సినిమాకు గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందించారు. తెలుగులో మొదటిసారి రిలీజయిన స్పటియాల్ ఆడియో సౌండ్ ట్రాక్ ఇది. ఇటీవల విడుదలైన విజయ్ ఆంథోనీ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
పోతే ఈ సినిమాలో రితికా సింగ్, మీనాక్షి చౌదరి, రాధికా శరత్ కుమార్, మురళి శర్మ, సిద్ధార్ధ్ శంకర్, కిషోర్ కుమార్, జాన్ విజయ్ కీలకపాత్రలు పోషించారు. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్త బ్యానర్లలో ఈ సినిమా నిర్మింపబడింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com