హీరోయిన్ రాశీఖన్నా మరోసారి తన మార్క్ చూపించింది. వైట్ అండ్ వైట్ లో బ్యూటిఫుల్ గా కనిపించింది. ఆమె నటించిన పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలు చాలా తక్కువ గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండు కూడా నిరాశపరిచాయి. యావరేజ్ సినిమాలు అనిపించుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా రోజుకో స్టైల్ లో అల రించింది. రాశీ. అయితే ఇటీవల కాస్త గ్యాప్ వచ్చింది. ఆ లోటును తీరుస్తూ తాజాగా వైట్ అండ్ వైట్ అందంగా కనిపించింది. అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఏడు సినిమాల్లో నటిస్తుంది. ఇందులో నాలుగు తమిళ సినిమాలు, రెండు తెలుగు, ఓ హిందీ సినిమా ఉంది. మరో రెండు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.