చిన్న సినిమాగా వచ్చిన 'డీజే టిల్లు' పెద్ద విజయాన్ని అందుకుంది. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. డీజే టిల్లు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్, డైలాగ్స్ ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడీ.. ఈ సినిమా సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. నెలలో డీజే టిల్లు-2కు సంబంధించి పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డీజే టిల్లులో నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది. సీక్వెల్ లో ఆమె స్థానాన్ని మరో కథానాయికతో భర్తీ చేయబోతున్నారు. ఈ సీక్వెల్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా అనుపమ స్థానంలో హీరోయిన్ గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. గ్లామర్ హీరోయిన్ గా రాణిస్తున్న శ్రీలీల డీజే టిల్లు గాడి పోరిగా పర్ఫెక్ట్ గా సరిపో తుందని భావిస్తున్నారట.