ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1M వ్యూస్ తో శంకర్ మహదేవన్ 'మా తిరుపతి' సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 20, 2022, 01:28 PM

"అలిపిరికి అల్లంతదూరంలో" అనే సినిమా నుండి ఇటీవల విడుదలైన మా తిరుపతి అనే సాంగ్ కు యూట్యూబులో విశేష స్పందన వస్తుంది. ఇప్పటికి ఈ పాట 1M వ్యూస్ తో, 12 K లైక్స్ ను సాధించింది. శంకర్ మహదేవన్, రమ్య బెహరా ఆలపించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు.
డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద అసిస్టెంట్ గా పని చేసిన ఆనంద్ జే దర్శకుడిగా మారి చేస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రంలో రావణ్ నిట్టూరు, నిఖితా అలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఫణి కళ్యాణ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్నికాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్, రాజేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com