1988 ఆగస్టు 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని పెంటపాడులో తెలుగమ్మాయి డింపుల్ హయాతి జన్మించారు. స్కూల్, కాలేజ్ విజయవాడలో చదివారు. యాక్టింగ్‌పై ఉన్న ఇష్టంతో స్కూల్ డేస్ నుంచే డింపుల్ హయాతి డాన్స్ నేర్చుకున్నారు. మోడల్‌గా సత్తాచాటిన డింపుల్.. 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీ రంగంలోకి వచ్చారు.2019లో 'యురేక' సినిమాలో డింపుల్ హయాతి నటించారు. 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'జర్ర జర్ర' పాటలో నటించి పాపులర్ అయ్యారు. 'ఎన్‌జీకే', 'అభినేత్రి2' సినిమాలోనూ నటించి ఆకట్టుకున్న డింపుల్ హయాతి.. దేవి 2 (తెలుగులో అభినేత్రి 2) సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అది అలా ఉంటే ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్ తో సోషల్ మీడియాను ఊపేస్తుంది డింపుల్.