కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం "గాడ్ ఫాదర్". లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
సోమవారం మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని రేపు సాయంత్రం ఆరున్నరకు ఈ మూవీ టీజర్ ను విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు.
2019లో విడుదలైన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సునీల్, పూరీజగన్నాధ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిధి పాత్రలో నటిస్తున్నారు.