ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ తేదీన విడుదల కానున్న చియాన్ విక్రమ్ 'కోబ్రా' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 22, 2022, 05:31 PM

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తన తదుపరి యాక్షన్ థ్రిల్లర్ సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కోబ్రా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 31, 2022న థియేటర్లలోకి రానుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్ 25న విడుదల కానుంది. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు విక్రమ్‌తో కూడిన ఒక స్పెషల్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, మృణాళిని రవి, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్  ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com