ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిబట్ మూవీ "గంగోత్రి". దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి వందవ సినిమాగా రూపొందిన ఈ సినిమా 2003 లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ అదితి అగర్వాల్. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి. గంగోత్రి సినిమాకు గాను బన్నీ కన్నా అదితికే చాలామంచి పేరు వచ్చింది. ఐతే, తదుపరి అదితి సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోక, వరస ఫ్లాప్ లు అందుకుని, ఆఖరికి సినీరంగం నుండి తప్పుకుంది.
లేటెస్ట్ గా గంగోత్రి జంట బన్నీ, అదితి కలుసుకున్నారు. దాదాపు 19 ఏళ్ళ తరవాత కలుసుకున్న ఈ జంట ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో కొంతమంది నెటిజన్లు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుణ్ణని కామెంట్ చేస్తున్నారు.