మెగా డాటర్ నిహారిక కొణిదెల 2016లో ఒక మనసు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఒక పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన తొలి తెలుగు నటి నిహారికనే. ఆపై సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ సినిమాలు చేసిన నిహారిక కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది.
2018లో నిహారిక, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తో కలిసి నటించిన 'ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్' తెలుగులో 'ఒక మంచి రోజు చూసి చెప్తా' చిత్రం లేటెస్ట్ గా తెలుగు ఓటిటి 'ఆహా' లో ఈ నెల 26 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.
చాలామంది ఆడియన్స్ కు ఇదొక సినిమా ఉందని కూడా తెలియదు. కానీ, ఈ సినిమా బ్లాక్ కామెడీ నేపథ్యంలో, చాలా ఫన్నీ అండ్ ఎక్జయిటింగ్ గా సాగుతుంది. ఖచ్చితంగా ప్రేక్షకులందరూ చూడాల్సిన సినిమా ఇది.