మొన్నీమధ్య ట్యాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారువారి పాట' సినిమాను చూసిన విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఎందుకంటే, పై నుండి కింద వరకు ఎవ్వరికి కనిపించకుండా దుస్తులు ధరించి, మాస్క్ పెట్టేసి, తలపైన స్కార్ఫ్ వేసుకుని కేవలం కళ్ళు మాత్రమే కనబడేలా రెడీ అయ్యి సాధారణ ప్రజానీకంతో కలిసి సాయి పల్లవి ఈ సినిమా చూసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పల్లవిని గుర్తుపట్టేసి, వీడియోలు తీసేసి ఈ విషయాన్ని ఫుల్ వైరల్ చేసేసారు.
లేటెస్ట్ గా మరొక స్టార్ హీరో ఇలా దొంగచాటుగా సినిమాలు చూశానని చెప్పి ఫ్యాన్స్ ను ఒక్కసారిగా షాక్ కు గురి చేసాడు. ఆయనెవరో కాదు... ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరో విజయ్ దేవరకొండ.
లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ... తన యాక్టింగ్ కు థియేటర్లో ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో లైవ్ లో తెలుసుకోవడమంటే చాలా ఇష్టమని, అందుకే బుర్ఖా ధరించి తన సినిమాలు ఆడుతున్న ధియేటర్స్ కు వెళ్లి అక్కడి జనాల మధ్య కూర్చుని సినిమాను చూస్తూ, వాళ్ళను గమనిస్తానని చెప్పాడు. ఇలా బుర్ఖా ధరించి చూసిన సినిమాలలో డియర్ కామ్రేడ్ ఒకటని చెప్పారు.