తమన్... టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంటున్న కంపోజర్. తమన్ స్వరపరిచిన పాటలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో, ఎంత వినసొంపుగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఐతే, ఒక్కోసారి తమన్ స్వరపరిచిన పాటలు వింటే, ఎక్కడో విన్న భావన కలుగుతుంది.
గతంలో ఇతర భాషల ఆల్బమ్స్ ను కాపీ కొట్టి టాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించిన తమన్ ఈసారి తన సొంత కంపొజిషన్ నే యాజిటీజ్ దించేసాడని నెటిజన్లు మండిపడుతున్నారు.
విషయమేంటంటే, మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'గాడ్ ఫాదర్' టీజర్ ప్రేక్షకాభిమానులను విపరీతంగా మెప్పించింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొచ్చేసరికి తమన్ బ్లండర్ మిస్టేక్ చేసాడు. వరుణ్ తేజ్ నటించిన 'గని' మూవీ టైటిల్ సాంగ్ ఎలా ఉంటుందో అచ్చు అలానే గాడ్ ఫాదర్ టైటిల్ ట్రాక్ ఉండడం మెగా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. మెగాస్టార్ లాంటి దిగ్గజ నటుడికి కాపీకొట్టుడు చెయ్యడమేంటని కొంతమంది నెటిజన్లు తమన్ పై మండిపడుతున్నారు. ఇక మీదటినుండైనా ఇలాంటి పనులు చెయ్యడం మానెయ్యమని ఉచిత సలహాలు ఇస్తున్నారు.