ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవలే "ది వారియర్" సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఫలితం గురించి పక్కన పెడితే లేటెస్ట్ గా ఆ సినిమాకు సంబంధించిన వ్యక్తి ఒకరు వార్తలకెక్కారు.
విషయమేంటంటే, వారియర్ డైరెక్టర్ లింగుసామికి చెన్నై సైదా పేట్ కోర్టు ఆర్నెల్ల జైలుశిక్ష విధించింది. ఆయనకే కాదు ఆయన బ్రదర్ సుభాష్ చంద్రబోస్ కి కూడా ఆర్నెల్ల శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో కార్తీ, సమంతలతో సినిమా ఒకటి ప్రారంభమైంది. దానికి లింగుసామినే డైరెక్టర్. ఆయన సొంత ప్రొడక్షన్ హౌస్ 'తిరుపతి బ్రదర్స్' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించేందుకు గానూ లింగుసామి పీవీపీ సినిమాస్ దగ్గరనుండి కొంతడబ్బును అప్పుగా పొందాడు. కానీ, ఎందుకో తెలియదు ఆ సినిమా ముందుకు సాగలేదు. లింగుసామి పీవీపీ సినిమాస్ కు తిరిగి డబ్బును కూడా ఇవ్వలేదంటూ ఆ సంస్థ లింగుసామి అండ్ టీం పై పలు రకాల కేసులు పెట్టింది. దాని ఫలితమే ఇప్పుడు లింగుసామికి పడ్డ ఆర్నెల్ల జైలుశిక్ష.