'కుమారి 21F' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్. ఆపై వరస సినిమాలలో హీరోయిన్ గా చేసిన హెబ్బా తదుపరి కాస్త వేగాన్ని తగ్గించి సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటుంది.
ఈ క్రమంలో హెబ్బా నటించిన వెబ్ ఫిలిం "ఓదెల రైల్వేస్టేషన్". ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాకు కథను అందించగా అశోక్ తేజ్ డైరెక్ట్ చేసారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై KK రాధామోహన్ నిర్మించారు. హెబ్బా పటేల్, వసిష్ఠ ఎన్ సింహ, పూజితా పొన్నాడ మెయిన్ లీడ్స్ గా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ తెలుగు ఓటిటి 'ఆహా'లో డైరెక్ట్ రిలీజ్ కానుంది. ఈ నెల 26 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.