బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ గుండెపోటుతో గోవాలో గత రాత్రి కన్నుమూశారు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలోని అడంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు.
ఆమెపై గెలుపొందిన కుల్దీప్ బిష్ణోయ్ ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అయితే సోనాలి మాత్రం ఎమ్మెల్యే టికెట్ తనకే దక్కుతుందని ప్రకటించారు. ఈ తరుణంలో సోనాలి హఠాన్మరణం ఆమె అభిమానులను కలిచివేసింది.