'పెళ్లి చూపులు' సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఈమధ్యనే సీతారామం సినిమాలో కనిపించారు. తాజాగా ఆయన కీడా కోలా అనే కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2021 జూన్‌లోనే ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటికీ నేడు పూజ కార్యక్రమం జరుపుకోనుంది. క్రైం కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది. 'నేడు సినిమాను లాంచ్ చేయనున్నట్లు తరుణ్ తెలిపాడు.