థియేటర్, ఓటీటీ రిలీజ్ మధ్య మినిమం 6 వారాల నుండి 8 వారాల గ్యాప్ ఉండాలని టాలీవుడ్ నిర్మాతలు ఇటీవలే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ ఒప్పందానికి కట్టుబడి ఆరు వారాల తర్వాత బింబిసారను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. బింబిసార డిజిటల్, శాటిలైట్ రైట్స్ జీ5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15 లేదా 16 నుంచి బింబిసార జీ5లో సీమింగ్ కానుందని తెలుస్తోంది. హిస్టారికల్ ఫాంటసీ అంశాలతో దర్శకుడు వశిష్ట మల్లిడి ఈ సినిమాను తెరకెక్కించారు. కేథరిన్, సంయుక్తమీనన్ హీరోయిన్లుగా నటించారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన చిత్రంగా బింబిసార రికార్డ్ సృష్టించింది. అన్నట్టు బింబిసార 2 కూడా రాబోతుంది.