ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"కోబ్రా" తెలుగు టీజర్ కు 3మిలియన్ వ్యూస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 12:10 PM

నిన్న సాయంత్రం విడుదలైన చియాన్ విక్రమ్ నటించిన కొత్త చిత్రం "కోబ్రా" తెలుగు టీజర్ యూట్యూబులో 3 మిలియన్ వ్యూస్ తో 162కే లైక్స్ తో దూసుకుపోతుంది. చియాన్ విక్రమ్ అద్భుతమైన నటనకు, టీజర్ కట్ చేసిన విధానం, ముఖ్యంగా కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. 
ఈ చిత్రానికి ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆగస్టు 31 వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com