ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ "బాహుబలి" తదుపరి ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో ఒకటిగా చరిత్రకెక్కింది.
లేటెస్ట్ గా ఈ సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలకవ్యాఖ్యలు చేసారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూసినప్పుడు తనకు ఒక సర్కస్ చూసిన భావం కలిగిందని, ఎస్పెషల్ గా రామ్, భీం లు కలిసి ఒక చిన్నారిని కాపాడే సమయంలో ఇద్దరు కూడా జెమినీ సర్కస్ లో పని చేసే ప్రొఫెషనల్ జిమ్నాస్ట్స్ గా కనిపించారని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. ఐతే, తన వ్యాఖ్యలు సినిమాను డీగ్రేడ్ చేసి మాట్లాడడం కాదని, సినిమా చూస్తున్నంత సేపు కూడా చాలా ఎక్జయిటింగ్ గా అనిపించిందని చెప్పారు.