ఐకానిక్ హాలీవుడ్ క్లాసిక్స్ స్పైడర్ మాన్, అవతార్ సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అది కూడా వచ్చే నెల్లోనే. సెప్టెంబర్ లో విడుదలయ్యే సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయినా ఈ ఇంగ్లీష్ సినిమాలు సెకండ్ టైం సెన్సేషన్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది.
సెప్టెంబర్ 2వ తేదీన స్పైడర్ మాన్ : నో వే హోమ్, సెప్టెంబర్ 23వ తేదీన అవతార్ పార్ట్ వన్ సినిమాలు ఇండియాలో అన్ని భాషల్లో విడుదల కాబోతున్నాయి. అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 16వ తేదీన విడుదల కాబోతున్న క్రమంలో మొదటి భాగం రీ రిలీజ్ కాబోతుంది.