ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ "రౌద్రం రుధిరం రణం (RRR)". ఇంకా ఇందులో ఆలియాభట్, అజయ్ దేవగణ్, ఒలీవియా మోరిస్, శ్రేయ కీలకపాత్రలు పోషించారు. భారతదేశపు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో ఒకటిగా, పాన్ ఇండియా మాత్రమే కాక పాన్ వరల్డ్ స్థాయిలో ఇండియన్ సినిమాకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెడుతున్న ఈ మూవీ లేటెస్ట్ గా ఒక అరుదైన ఘనతను సాధించింది.
అదేంటంటే, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న RRR మూవీ వరసగా పద్నాలుగు వారాలపాటు గ్లోబల్ ట్రెండింగ్ లిస్టులో ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా సత్తా చాటింది. అదికూడా నెట్ ఫ్లిక్స్ ఇంగ్లీష్ మరియు నాన్ ఇంగ్లిష్ లిస్టులలో టాప్ లిస్టులో ఉండడం మరీ విశేషం. ఇలాంటి రికార్డు సాధించిన సినిమా ఒక్క RRR కావడం నిజంగా గ్రేట్.