బాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటిస్తున్న చిత్రం "బ్రహ్మాస్త్ర". సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో నేడు చెన్నైలో బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ జరగబోతుంది. ఈ మేరకు హీరో రణ్ బీర్, నాగార్జున, రాజమౌళి ముగ్గురు చెన్నై బయలుదేరి వెళ్లారు. నాగార్జున ఈ సినిమాలో కీలక నందిఅస్త్ర పాత్రను పోషించగా, రాజమౌళి తెలుగులో ఈ సినిమాను సమర్పిస్తున్నారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రీతం సంగీతం అందించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచింది.
![]() |
![]() |