అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ జంటగా, భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్లో ఫుల్ టైం ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం "సుడిగాడు". 2012, ఆగస్టు 24వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. 2012లో విడుదలైన ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మోనాల్. ఏడు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 32 కోట్లను కలెక్ట్ చేసింది.
మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికి కలెక్షన్లు బాగానే సంపాదించిన ఈ మూవీలో షియాజీ షిండే, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, కోవై సరళ, అలీ, ms. నారాయణ, కృష్ణ భగవాన్ తదితర కామెడీ నటులు నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa