పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన తాజా పాన్-ఇండియన్ మూవీ లిగర్. ఈ సినిమా ఈరోజు విడుదలైంది.
కథ : లైగర్ (విజయ్ దేవరకొండ) తన తల్లి బాలామణి (రమ్యకృష్ణ)తో కలిసి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ముంబైకి వస్తాడు. జాతీయ ఛాంపియన్‌గా ఎదగాలని కలలు కంటున్నాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య, లిగర్ తాన్య (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు. మరి లిగర్ ప్రయాణంలో తాన్య ప్రేమ దేనికి దారి తీసింది? లిగర్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? లేదా ?, అసలు లిగర్ తన కలను సాకారం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం ఏమిటి ?, మధ్యలో మైక్ టైసన్ ట్రాక్ ఏమిటి ? అన్నది మిగతా కథ.
ప్లస్ పాయింట్లు: ఈ మధ్య కాలంలో పూరి సినిమాకు వచ్చినంత హైప్ మరే సినిమాకు రాలేదు. ఇక, భారీ అంచనాల నడుమ ప్యూర్ మాస్ మసాలా ఎలిమెంట్స్ తో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. ఫుల్ ఎనర్జీతో విజయ్ నటన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా ఈ సినిమా కోసం విజయ్ చేసిన కృషి చాలా బాగుంది. లైగర్ క్యారెక్టర్‌లో విజయ్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్ నటన చాలా కొత్తగా ఉంటుంది. విజయ్ తన హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. ఇక విజయ్ సరసన హీరోయిన్ గా నటించిన అనన్య పాండే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన గ్లామర్ తో అలరించింది. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో విజయ్, అనన్యల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. రమ్యకృష్ణ, అలీ, మైక్ టైసన్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.
మైనస్ పాయింట్స్ : పూరి మంచి స్టోరీ లైన్‌తో పాటు లిగర్ అనే మంచి క్యారెక్టర్‌ని రాసుకున్నప్పటికీ, ఆ పాత్రకి తగ్గట్టుగా కథనం రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో యూత్ ని ఎట్రాక్ట్ చేయడానికి.. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి సీన్ లో బోల్డ్ నెస్ పెట్టడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. అంతేకాదు సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నిదానంగా సాగుతాయి. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ప్రేమలో పడే సీన్స్ తో పాటు సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా సిల్లీగా ఉంటుంది. తల్లి పాత్ర ఎలివేషన్ కూడా బాగాలేదు. రమ్యకృష్ణ పాత్ర చాలా బలంగా ఉంటుంది. సినిమాలోని కీలక సన్నివేశాలకు సరైన లాజిక్ లేదు. పైగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. క్లైమాక్స్‌లోని మెయిన్ పాయింట్ ఆధారంగా సరైన ముగింపు ఇచ్చి ఉంటే బాగుండేది. అలాగే మైక్ టైసన్ సీక్వెన్స్ మరింత బలంగా రాయాలి.
రేటింగ్: 2.5/5.