మారుతి దర్శకత్వం వహించిన తొలి సినిమా బస్ స్టాప్ తెరకెక్కించాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని కొత్త జంట, భలే భలే మగాడివోయ్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇటీవల ఆయన తెరకెక్కించిన పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అది కమర్షియల్‌గా హిట్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో భయం మొదలైంది. రేపు ప్రభాస్- మారుతి సినిమా లాంఛ్ అవుతుండటంతో అభిమానులు రంగంలోకి దూకారు. ఇప్పుడీ సినిమా అవసరమా వద్దేవద్దంటూ వరుస ట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. పైగా ప్రభాస్‌కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇప్పటికే కొందరు దర్శకులకు ఛాన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు ప్రభాస్. రన్ రాజా రన్‌తో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన సుజిత్ రెండో సినిమా ప్రభాస్‌తో తీశాడు. అలా వీరి కాంబినేషన్‌లో వచ్చిన సాహో ఘోర పరాజయం పాలైంది. ప్రయాణం, సాహసం చిత్రాలకు డైలాగ్స్ రాసిన రాధాకృష్ణకుమార్ జిల్ మూవీతో దర్శకుడిగా మారాడు. ఆయన సెకండ్ మూవీ రాధేశ్యామ్ ప్రభాస్‌తో తీయగా అది కూడా ఫ్లాప్ అయింది. వరుసగా రెండు ఫ్లాప్‌లతో డీలా పడిన ప్రభాస్ ఇటీవలే ఫ్లాప్ అందుకున్న డైరెక్టర్ మారుతితో జత కట్టకూడదని అభిమానులు ఫిక్సయ్యారు. అందుకే నెట్టింట ఈ రచ్చఅంటున్నారు .