యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతితో ఒక సినిమాకు కమిటయ్యారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. ఐతే, అధికారికంగా ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు.
కానీ లేటెస్ట్ గా ఈ రోజు ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైందని ప్రచారం జరుగుతుంది. ఐతే, ఈ పూజకు సంబంధించిన ఒక ఫోటో కానీ, వీడియో కానీ బయటకు రాకపోవడం విశేషం. దీంతో ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ లో చాలా అసందిగ్ధత నెలకొంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించబోతుందని టాక్. ఈ నవంబర్ నుండి షూటింగ్ కూడా మొదలు కాబోతుందని అంటున్నారు. ఐతే, ఈ విషయాలన్నిటిపై క్లారిటీ రావాలంటే, అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.