రాజమౌళి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన "RRR" మూవీ అద్భుతమైన థియేటర్ రన్ ను ముగించుకుని, ఆపై డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసి దాదాపు పద్నాలుగు వారాల పాటు గ్లోబల్ ట్రెండింగ్ లిస్ట్ లో ట్రెండ్ అవుతూ వచ్చింది. RRR సినిమాకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవమిది.
గత ఆదివారం తొలి సారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఐన RRR అప్పటివరకు ఉన్న బుల్లితెర TRP రేటింగ్స్ను వెనక్కి నెట్టి న్యూ రికార్డును నెలకొల్పుతుందని అంతా అనుకున్నారు. కానీ, అలాంటిదేమి జరగలేదని లేటెస్ట్ గా రిలీజైన TRP రేటింగ్స్ లిస్ట్ ను బట్టి తెలుస్తుంది.
RRR కు 19.62 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఐతే, ఈ రేటింగ్ మరీ గుడ్ కాదు అలాఅని మరీ బ్యాడ్ కాదు. ఐతే, RRR వంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీకి రావలసిన రేటింగ్ ఐతే ఇది కాదు. ఐతే ఇందుకు చాలా కారణాలున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే, RRR థియేటర్లలో చాన్నాళ్లు ప్రదర్శింపబడింది. అదీకాక రెండు మూడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ లో కూడా అందుబాటులో ఉంది. వీటివల్ల బుల్లితెర TRP రేటింగ్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చని క్లియర్ గా తెలుస్తుంది.