మనం ఎక్కువగా చూసుకుంటే సెలబ్రెటీలు ప్రకటనలు చేస్తుంటారు ప్రఖ్యాత కంపెనీ లకు .బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉండాలి అని అనుకుంటారు అలాగే కొంత మంది మెగాస్టార్ చిరంజీవి నుంచి అల్లు అర్జున్, విరాట్ కోహ్లీ, షారుఖ్ ఖాన్, యశ్ వంటి స్టార్ హీరోలు పలు బ్రాండ్లు ప్రమోట్ చేస్తూ ప్రకటనలు` చేసిన సంగతి తెలిసిందే. కానీ భారీ మొత్తంలో ఆఫర్స్ వచ్చినా కాదనుకున్నవారు ఉన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే పలు బ్రాండ్స్ వ్యసనానికి దారితీసే ఉత్పత్తులకు యాడ్స్ చేసేందుకు అంగీకరించకుండా కొంత మంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్టార్స్ సైతం కోట్లను కాదనుకున్నారు.న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఫెయిర్ నెస్ క్రీమ్ ప్రమోట్ చేయాలని భారీ మొత్తంలో ఆఫర్ వచ్చిందట. అయితే అభిమానులను మోసం చేయడం ఇష్టం లేదని ఆ ఆఫర్ కాదనుకుంది సాయిపల్లవి. అలాగే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పొగాకు కంపెనీకి సంబంధించిన యాడ్ చేసేందుకు నిరాకరించాడు. తన ఫ్యాన్స్ ప్రకటనను చూసి వ్యసనానికి దారితీసే ఉత్పత్తిని తినడం ఇష్టం లేదని తెలిపారు. అలాగే ప్రబాస్ గతేడాది రూ. 150 కోట్లు విలువైన బ్రాండ్ యాడ్స్ కాదనుకున్నాడు. ఇండస్ట్రీలో తనకున్న స్థానం. అభిమానుల ఫాలోయింగ్ పట్ల ప్రభాస్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు.అభిమానులను మోసం చేయడం ఇష్టం లేదని ఆ ఆఫర్ కాదనుకున్నారు అలాగే నందమూరి బాలకృష్ణ కూడా పలు బ్రాండ్స్ ప్రమోట్ చేసేందుకు ఆఫర్ వచ్చేనా ఆ ప్రకటన చేయటానికి ఇష్టపడలేదు. ఒక నటుడిగా సినిమాల ద్వారా ప్రజలను అలరించడమే తనకు ముఖ్యమని జీవితాంతం నటుడిగానే ఉండిపోతానని తెలిపారు.