నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన "కార్తికేయ 2" ఆగస్టు ఐదవ తేదీన విడుదలై ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చందూ మొండేటి డైరెక్షన్లో ఇండియన్ మిస్టికల్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ఉత్తరాదిన పెను సంచలంగా మారి, కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.
లేటెస్ట్ గా కార్తికేయ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల కలెక్షన్లు రాబట్టి నిఖిల్ కెరీర్ లో మైల్ స్టోన్ లా నిలిచిపోయింది. దీంతో మేకర్స్ ఈ వంద కోట్ల సెలెబ్రేషన్స్ ను కర్నూల్ ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో ఆగస్టు 26వ తేదీన సాయంత్రం ఐదింటి నుండి జరపాలని నిర్ణయించారు.
బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, ఆదిత్యా మీనన్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష, తులసి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు.