కొత్త దర్శకుడు గిరిశాయ డైరెక్ట్ చేస్తున్న తొలి తెలుగు చిత్రం "రంగ రంగ వైభవంగా". ఇందులో యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్, కేతికాశర్మ జంటగా నటించారు.
ఈ మూవీ టైటిల్ సాంగ్ ను రేపు ఉదయం పదింటికి విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
ఈ సినిమాతో మెగా మేనల్లుడి ఖాతాలో సూపర్ హిట్ పడుతుందని మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి DSP సంగీతం అందించారు. సెప్టెంబర్ రెండవ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa