కోలీవుడ్ సీనియర్ హీరో విక్రమ్ నటించిన కొత్త చిత్రం "కోబ్రా" మూవీ ట్రైలర్ కొంచెంసేపటి క్రితమే విడుదలయ్యింది. ఐతే ఈ ట్రైలర్ కేవలం తమిళ భాషలోనే విడుదలయ్యింది. తెలుగు ట్రైలర్ రిలీజ్ పై మేకర్స్ ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆర్. జ్ఞానముత్తు డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ఆగస్టు 31వ తేదీన విడుదల కాబోతుంది.