కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, సీనియర్ హీరో విక్రమ్ తో కలిసి చేసిన సినిమా "ధృవనక్షత్రం". ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎందుకో తెలియదు ఇన్నాళ్ళబట్టి విడుదల కాలేదు.
లేటెస్ట్ గా ఈ సినిమా డిసెంబర్ లో విడుదలవుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఐతే, ఈ విషయంలో మూవీ టీం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేస్తే కానీ నిజమని నమ్మలేం.
రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు.