నాచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం "దసరా". కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ పై ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ను రేపు ఉదయం 11:11 గంటలకు ఇవ్వబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.