"ఆడవాళ్ళూ మీకు జోహార్లు" మూవీ తదుపరి శర్వానంద్ "ఒకేఒక జీవితం" అనే సినిమాలో నటిస్తున్నారు. తమిళంలో "కణం" అనే టైటిల్ తో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటివరకు ఈ సినిమా నుండి రెండు లిరికల్ సాంగ్స్ విడుదలవ్వగా, ఈ రోజు సాయంత్రం ఐదింటికి మూడవ లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ పాటను కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఆలపించనున్నారు. అలానే ఈ పాటకు స్టెప్స్ కూడా వేయనున్నారు. ఈ ఒక్క పాటలోనేనా లేక సినిమాలో కూడా కార్తీ ఉంటాడా? అన్నది తెలియాల్సి ఉంది.
శ్రీ కార్తీక్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో అక్కినేని అమల కీలకపాత్రను పోషిస్తున్నారు. డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై SR ప్రకాష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa