సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన కింగ్ నాగార్జున నటించిన "ది ఘోస్ట్" ట్రైలర్ కు ఆడియన్స్ నుండి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. నిన్న సాయంత్రం విడుదలైన ఈ ట్రైలర్ యూట్యూబులో #2 పొజిషన్ లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు 4.6 మిలియన్ వ్యూస్ తో 175కే లైక్స్ తో దూసుకుపోతుంది.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్, భరత్ సౌరభ్ సంగీతం అందించారు. సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతోనైనా నాగ్ సూపర్ డూపర్ హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa